calender_icon.png 4 July, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారులను గుర్తించడానికి కమిషన్‌ను వేయాలి

04-07-2025 01:35:36 AM

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్

ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కమీషన్ ను వేయ్యాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ...

తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమంలో ఎవరెవరు పాల్గొంది, చనిపోయిన వారి కుటుంబాలు, జైలుకు వెళ్ళిన వారి వివరాలను సేకరించి 3 నెలల లోపు ఉద్యమ కారుల లిస్ట్ను తయారు చేసి ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల మెని ఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏ ఆకాంక్షతో రాష్ట్రం ఏర్పడిందో దాన్ని గుర్తించి ఉద్యమకారులను గౌరవించాలన్నారు.

ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే అదే తరహాలో ప్రభుత్వానికి ఉద్యమకారులు నిరసన తెలియజేయాల న్నారు. ఎమ్మెల్సీ కొదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం తెలంగాణ ఉద్యమకారుల స్టీరింగ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారు లు విమలక్క, కె. గోవర్ధన్, జి. ఝాన్సీ, ప్రపూల్ రామిరెడ్డి, మన్నారం నాగరాజు, ఆనందం, కుమార స్వామి, మోహన్ బైరాగి, గొల్లపల్లి దయానంద్, చంద్రన్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.