calender_icon.png 27 August, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగుల పూడికతీత పనులపై సమగ్ర విచారణ జరిపించాలి

27-08-2025 02:01:56 AM

మణుగూరు, ఆగస్టు 26 ( విజయ క్రాంతి) : మండలంలోని కట్టవాగు, మెట్టవా గు, కోడిపుంజుల వాగుల పూడిక తీత పనులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల ని,రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూణెం సరోజ డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

లక్షల రూ పాయల ప్రజాధనంతో చేపట్టిన వాగుల పూ డికతీత పనులలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్ ధనదాహంతో నాసిరకంగా పనులు చేపట్టారని, దీంతో వర్షాకాలం ప్రజలకు వరద ముంపు పొంచిఉందన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలి పా రు.

మూడు సంవత్సరాలగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కాల్వల్లో పూడికతీత తీయ కుండా డబ్బులు జేబులో వేసుకునే విధంగా అక్రమాలకుతెరలేపారన్నారు. ఈ విషయం పై అన్ని వివరాలతో సీఎం రేవంత్ రెడ్డికి త్వరలోనే ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అక్షర మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.