27-08-2025 02:00:15 AM
భద్రాచలం, ఆగస్టు 26 (విజయక్రాంతి) భద్రాచలం దేవస్థానం నిర్వణాధికారిక, డి ప్యూటీ కలెక్టర్ కే దామోదర్ రావు త్వరలో రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన బదిలీలలో భద్రాచలం సబ్ కలెక్టర్ గా మృణాల్ శ్రేష్ట ను నియమించడంతో అప్పటి వరకు భద్రాచలం లో ఆర్డీవోగా పనిచేస్తున్న దామోదర్ రావు బదిలీ అయ్యారు.
దీంతో ఆర్డీవో దామోదర్ రావు భద్రాచలం దేవస్థానం ఈవోగా పనిచేయటానికి సంసిద్ధత వ్యక్తం చేసి ఆ దిశగా ప్రయ త్నాలు చేయగా ఎట్టకేలకు ఆగస్టు 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవోగా నియమించాలని దేవదయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేవాదాయ శాఖ మరో రెండు రో జుల్లో భద్రాచలం ఈవోగా దామోదర్ రావుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
అయితే గతంలో ఈవోగా పనిచేసిన ఎల్ రమాదేవి భద్రాద్రి దేవాలయం అభివృద్ధికి విశేష కృషి చేశారు. దేవాలయంలోఅనేక నూతన సంస్కరణలు పూజలు ప్రవేశపెట్టి భద్రాద్రి దేవాలయం ఆదాయాన్ని భారీగా పెంచడానికికృషిచేశారు.