27-08-2025 02:04:01 AM
- చోరీ కేసుల ఛేదనలో పురోగతి..
- త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడుపుతే కేసులు నమోదు
- పోలీస్ అధికారుల సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్..
ఖమ్మం, ఆగస్ట్ 26 (విజయ క్రాంతి): వినాయక నవరాత్రి ఉత్సావాల సందర్భంగా ప్రజా భద్రతతో పాటు ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా అధికారులందరు సమష్టిగా కృషిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అదేశించారు.
పోలీస్ కాన్ఫిరెన్స్ హలో మంగళవారం జరిగిన నేర సమీక్ష సమావేశంలోపోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేశ్ విగ్రహాల ప్రతిష్ఠాపన మొదలునిమజ్జనోత్సవం వరకు ఎక్కడ కూడా చిన్న పొరపాటుకు తావు లేకుండా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అన్నారు. ముఖ్యంగా ఉత్సవాల్లో భక్తులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలకగకుండా విధిగా మండపాలను సందర్శించి నియమ నిబంధనలు పాటించేలా చూడాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడానికి సన్నద్ధమై ఉండాలని అన్నారు.
విజుబుల్ పోలీసింగ్ కు తగిన ప్రాధాన్యతను ఇవ్వడంతో రాత్రివేళ్లలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాలపై డివిజన్ స్థాయి అధికారులు విధిగా సమీక్షించాలని , ఛార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడం అలవారుచుకోవాలని పోలీసు అధికారలకు సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో నేరాల రేటు విశ్లేషణ, శిక్ష విధించే రేట్లను పెంచడం వంటి విషయాలపై అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాలు, మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ప్రధాన చోరీ కేసుల దర్యాప్తులో పురోగతి, మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలు, వ్యవస్థీకృత నేర ముఠాలు మరియు మాదకద్రవ్యాల సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆన్నారు. రహదారుల్లో త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ తో పాటు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులను నమోదు చేసి న్యాయస్థానంలో శిక్షలు పడేలా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సమావేశంలో అడిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు,ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రహేమన్, రఘు, సాంబరాజు, మహేష్, సర్వర్, సత్యనారాయణ పాల్గొన్నారు.