calender_icon.png 27 August, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి విగ్రహాలను కొలవండి..-ప్రకృతిని కాపాడండి

27-08-2025 02:05:19 AM

ఎంపీ వద్దిరాజు పిలుపు 

ఖమ్మం, ఆగష్టు 26 (విజయ క్రాంతి): వినాయక నవరాత్రుల సందర్బంగా ప్రతి ఇంట్లో మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పలువురు ఆధ్యాత్మిక, రాజకీయ ప్రముఖులకు రవిచంద్ర మట్టి విగ్రహాల కిట్లను పంపారు.

వాటిని బుర్హాన్ పురంలోని ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బంది, బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఔత్సహిక యువకులు మోక్ష స్పిర్చువాలిటి పేరుతో రూపొందించిన కిట్లో 9 రకాల పూజా సామాగ్రితో పాటు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహం ఉంచారు.

ఈ కిట్లను పంచడం ద్వారా ఆధ్యాత్మిక, పర్యావరణ ప్రాధాన్యత తెలిపినట్లు అవుతుందని ఎంపీ రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని పెంపోందించు కోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల గాంధీ, ఎంపీ కార్యాలయ ఇంచార్జి సయ్యద్ ఇస్మాయిల్, వద్దిరాజు యూత్ నాయకులు సుంకర చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.