calender_icon.png 27 December, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

27-12-2025 12:08:39 AM

ములకలపల్లి, డిసెంబర్ 26, విజయక్రాంతి):కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఎస్ కే ఉమర్ ఆరో పించారు. ములకలపల్లి మండలంలోని గుట్టగూడెం గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సం ఘం జిల్లా సహాయ కార్యదర్శి కుంజ కృష్ణ అధ్యక్షతన శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు పని కల్పించాలని ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాని పేరు మార్చి ప్రజలకు పని కల్పించకుండా ఇబ్బంది పెట్టే విధంగా ఉపాధి పనులను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు.

అలాగే దేశంలో విద్యుత్ సవరణ చట్టం ప్రవేశపెట్టి పేదల మీద మధ్యతరగతి రైతుల మీద భారం మోపే విధంగా ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వం తెచ్చిన చట్టాలను రద్దుచేసి యధావిధిగా ఉంచే విధంగా ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మడి చంద్రం, దుబ్బ వెంకటేశ్వర్లు,వంక సురేష్, భాస్కర్,రామ్మూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.