calender_icon.png 27 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోటార్ బోట్ ఫ్యాన్‌లో దుప్పటి చిక్కుకొని జాలరి మృతి

27-12-2025 12:07:25 AM

అశ్వాపురం, డిసెంబర్ 26 (విజయక్రాంతి): చేపల వేట కోసం వెళ్లిన ఓ జాలరి ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం మండలంలోని చింతిర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. అ శ్వాపురం సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిం తిర్యాల గ్రామానికి చెందిన నాగుల వెంకటరమణ (జాలరి) ఎప్పటిలాగే చేపలు పట్టేందుకు శుక్రవారం తెల్లవా రుజామున 3 గంటల సమయంలో గోదావరికి వెళ్లాడు.

ఈ క్రమంలో బోటుపై ప్రయాణిస్తుండగా, చలికి కప్పుకున్న దుప్పటి ప్రమాదవశాత్తు మోటార్ బోట్ ఫ్యాన్లో ఇరుక్కుపోయింది. దీంతో దుప్పటి గొంతుకు బిగుసుకుపోవడంతో వెంకటరమణ అదుపుతప్పి గోదావరిలో పడిపోయారు. విష యం తెలుసుకున్న స్థానిక జాలర్లు, గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రమించిన గాలింపు బృందాలు అశ్వాపురం పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్, మరియు డిడిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

సుమారు 5 నుంచి 6 గంటల పాటు సాగిన గాలింపు అనంతరం వెంకటరమణ మృతదేహం లభ్యమైంది.మృతుని తమ్ముడు నాగుల సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.