27-12-2025 12:10:06 AM
బూర్గంపాడు, డిసెంబర్ 26,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలం సారపాక కాంగ్రెస్ నేత యడమకంటి రోషిరెడ్డి అకాల మరణం చెందడంతో శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని,అకాల మరణం చెందడం చాలా బాధాకరమని అన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.