calender_icon.png 27 December, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ గుబులు మొదలైంది

27-12-2025 01:58:59 AM

  1. బీఆర్‌ఎస్ కారు టైరు మెల్లిమెల్లిగా పంక్చరవుతుంది 
  2. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు 
  3. కార్యకర్తల కష్టంతోనే గజ్వేల్ లో 90 కి పైగా సర్పంచ్ల గెలుపు
  4. ప్రజల కష్టాలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయండి
  5. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి
  6. గెలిచిన సర్పంచ్లను సీఎంతో కలిపిస్తా 
  7. గజ్వేల్‌లో గెలిచిన కాంగ్రెస్ సర్పంచులను సన్మానించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి 

 గజ్వేల్, డిసెంబర్ 26: గజ్వేల్ నియో జకవర్గం లోని 90 కి పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కెసిఆర్ గుండెల్లో గుబులు పుట్టిందని, అం దుకే తోలు తీస్తా అంటూ పిచ్చిపిచ్చిగా మా ట్లాడుతున్నారని ఉపాధి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు అన్నారు. సిద్దిపేట జిల్లా  గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ అ భ్యర్థులకు గజ్వేల్ లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు  ఆంక్ష రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిలతో కలిసి పాల్గొని వారు సర్పంచ్లను ఘ నంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూ తనంగా గెలుపొందిన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలతో స ర్పంచ్, వార్డు మెంబర్లను గెలిచామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించే వరకు ఇదే ఉత్సాహంతో విజయయాత్ర కొనసాగాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను ఇంచార్జ్ మంత్రికి విన్నవిస్తే పరిష్కరిస్తామన్నారు. ఎన్నికలు అయిపోయాయని, ఓడిన వారైనా గెలిచిన వారైనా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో కాంగ్రెస్ పార్టీ నేత కూర్చునేంత వరకు కార్యకర్తలు కష్టపడాలన్నారు. సర్పంచులు చెప్పిన సమస్యల పరిష్కారానికి చొ రవ చూపే బాధ్యత మంత్రులుగా తమదేనన్నారు.

గ్రామాల్లోని అన్ని సమస్యలు పరి ష్కరించుకుందామని, ఓడిన వాళ్ళు బాధపడకుండా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలు పే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చా రు. అనంతరం ఉపాధి కార్మిక శాఖ మం త్రి వివే క్ వెంకటస్వామి మాట్లాడుతూ గజ్వేల్లోని తొంబై పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన వారు సర్పంచులుగా గెలిచారని కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందన్నారు. అం దుకే తోలు తీస్తా అని కాంగ్రెస్ పార్టీ మీద పి చ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ తనను గెలిపించిన గజ్వెల్ ప్రజల సమస్యలు పట్టించుకోలేదు కానీ తో లు తీ స్తాడంట అంటూ ఎద్దేవా చేశారు.

గతానికంటే ఎక్కువగా దుబ్బాకలో 56 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని, సిద్దిపేట జిల్లాలో స ర్పంచ్ క్యాండేట్ దొరకడమే కష్టంగా ఉండేదని, ఇప్పుడు ప్రతి స్థానంలో అభ్యర్థిని పె ట్టామని కొన్ని గెలిచామన్నారు. బిఆరెస్ పా ర్టీ టైర్ పంచరయి మెల్లిగా పోతుందన్నారు. కార్యకర్తల కష్టం వల్లే ఇన్ని స్థానాలు గెలుపొందామని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కా ర్డులు, సన్న బియ్యం పథకాలు ప్రజలలో మంచి స్పందన ఉందన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండి వారి కష్టాలు సమస్యలు తెలుసుకోవాలని, అప్పుడే నాయకుడికి, ప్రజలకు మధ్య బాండింగ్ ఏర్పడుతుందన్నారు.

ము ఖ్యమంత్రి  మాట్లాడినప్పుడు కూడా  మన జిల్లాకు ఎక్కువ నిధులు ,ఎక్కువగా ఇందిర మ్మ ఇండ్లను ఇవ్వమని కోరానన్నారు. గెలిచిన సర్పంచులందరినీ ముఖ్యమంత్రితో కలి పిస్తానని సర్పంచులకు హామీ ఇచ్చారు.  అం తకుముందు ప్రజ్ఞాపూర్ హరిత రెస్టారెంట్ నుండి భారీ ర్యాలీతో సభాస్థలికి మంత్రులకు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మ న్ నిమ్మ రంగారెడ్డి అధ్యక్షత వహించగా, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, భూo రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, కిష్టా గౌడ్, సుఖేందర్ రెడ్డి, భా స్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.