02-11-2025 01:19:56 AM
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి ): రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యా య ఖాళీలున్నాయి. ఇటీవల చేపట్టిన ప్రమోషన్ల ప్రక్రియతో చాలా బడుల్లో టీచర్ల కొరత ఏర్పడింది. దీనితో టీచర్ల సర్దుబాటుపై డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఆదేశాలు జారీచేశారు. అవసరమైన చోట వెంటనే మిగులు టీచర్లతో సర్దుబాటు చేస్తామన్నారు.
ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసిన ప్పడు, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినప్పుడు అవసరం ఉన్న పాఠశాలలకు మిగులు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించాలని పేర్కొన్నారు. ఎక్కువ మంది టీచర్లు ఉన్న పాఠశాలల నుంచి తక్కువ టీచర్లు ఉన్న పాఠ శాలలకు టీచర్లను సర్దుబాటు చేస్తారు. సర్దు బాటుకు సంబంధించి గతంలోనే ఒకసారి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన ప్పటికీ ఈ ప్రక్రియ అన్ని జిల్లాలలో పూర్తి కాలేదు.