calender_icon.png 2 November, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పేరుతో కూల్చివేతలు అనాలోచిత చర్య

02-11-2025 01:22:57 AM

బాధితులు వీవీ శాస్త్రీ, శ్రీధర్

ఖైరతాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి) : కేబీఆర్ పార్కు వద్ద అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడానికి చర్య లు చేపట్టడం అనాలోచిత చర్య అని బాధితులు వీవీ శాస్త్రీ, శ్రీధర్, డాక్టర్ చంద్రశేఖర్ లు ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మల్టీ జంక్షన్ ప్రాజెక్టు పేరు తో గతేడాది కేబీఆర్ పార్కు వద్ద అగ్రసేన్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెకోపోస్టు వరకు తమ ఇండ్లు, వ్యాపార వాణిజ్య కేంద్రాల స్థలాన్ని సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందన్నారు.

నోటీసులు జారీ చేసి కూల్చివేతలకు మార్కింగ్ సైతం చేశారన్నా రు. జాతీయ పార్కు ఉన్న స్థలం చుట్టూ అభివృద్ధి చేపట్టాలన్నా, అక్క డే స్థిర నివాసం ఏర్పర్చుకున్న వారి స్థలాన్ని సేకరించాలన్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారితో ఎక్స్పర్ట్ కమిటీ వేసి దాని నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, కాని ప్రభుత్వం అలాంటివేమి చేపట్టకుండానే నేరుగా తమ ఇండ్లు, వ్యాపార సముదాయాలను కూల్చివేసేందుకు సిద్దమైందన్నారు.

హైకోర్టు సైతం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సందించిందని, అయినా తాజాగా మళ్లీ త మ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభు త్వం చర్యలు ప్రారంభించిందని, అందుకు సెక్షన్ 10ఏను సాకు గా చూపిస్తుందన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలన్నా అనేక అనుమతులు తీసుకోవాలని, ప్రభుత్వ చర్యలతో ప్రకృతికి నష్టం జరుగుతుందన్నారు.