calender_icon.png 2 November, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం వ్యాఖ్యలు దేశగౌరవానికి అవమానం

02-11-2025 01:22:00 AM

  1. బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఎక్స్‌లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): సీఎం వ్యాఖ్యలు దేశ గౌరవానికి అవమానకరంగా ఉన్నాయని, ఇందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కార్పె ట్ బాంబింగ్ వ్యాఖ్యలపై శనివారం వారు వేర్వేరుగా ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిం దూర్ దేశ ప్రజల ఆమోదంతోనే చేశామన్నారు.

ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ గురించి సీఎం చేసిన వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని, సైనికుల ధైర్య సహాసాలను అవమా నించేలా ఉన్నాయని తెలిపారు. పాకిస్తాన్‌లో పేలని బాంబులు, జూబ్లీహిల్స్‌లో పేలుతాయని రేవంత్ అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడే ‘మా కార్పెట్ బాంబు దాడులు’ ఉంటాయని మండిపడ్డారు. ‘మీ అవినీతి’, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తమ కార్పెట్ బాంబులు పేలుతాయని పేర్కొన్నారు.