04-10-2025 01:35:09 AM
-వాహన పూజకు పోటెత్తిన భక్తులు
- అట్టహాసంగా సాగిన వన దుర్గమ్మ నిమజ్జన కార్యక్రమం
- గ్రామ గ్రామాన ముగిసిన దుర్గమ్మ నవరాత్రోత్సవాలు
- ఘనంగా వీడ్కోలు పలికిన గ్రామస్తులు
పాపన్నపేట, అక్టోబర్ 3 :వాగులు, వంక లు.. కొండలు, కోనలు దాటి వచ్చిన భక్తజనంతో గురువారం ఏడుపాయల వనం జనారణ్యమైంది. ఏడుపాయల్లో కొలువుతీరిన వనదుర్గమ్మను విజయదశమి రోజున భక్తులు దర్శించి తరించారు. ఎటు చూసినా జనమే జనంతో ఏడుపాయల క్షేత్రం హోరెత్తింది.
జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వనదుర్గమ్మను దర్శించుకునేందుకు, నూతన, పాత వాహనాలకు పూజలు నిర్వహించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. దీంతో పాటు తొమ్మిది రోజులుగా అట్టహాసంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన గురువారం విజయదశమిని పురస్కరించుకొని వనదుర్గామాతను రాజరాజేశ్వరి దేవి రూపంలో పసుపు వస్త్రంతో అలంకరించారు.
అట్టహాసంగా సాగిన దుర్గమ్మ నిమజ్జనం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరిరోజైన గురువారం విజయదశమిని పు రస్కరించుకుని వనదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అ నంతరం వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని గో కుల్ షెడ్ నుంచి పల్లకి సేవ నిర్వహించి ఏడుపాయల పురవీధుల గుండా ఊరేగింపుగా తీ సుకెళ్లి ఏడుపాయల్లో ఒకటైన మంజీరా నదీ పాయలో నిమజ్జనం కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. నర్సాపూర్ మాజీ ఎ మ్మెల్యే మదన్ రెడ్డి, ఆయా పార్టీల మండల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.