18-12-2025 12:47:20 AM
జడ్జిలకు, న్యాయవాదులకు అవగాహన
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): బార్ అసోసియేషన్ ఇబ్రహీంప ట్నం, న్యాయవాది పరిషత్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో న్యాయవాదులకు, జడ్జిలకు, కోర్టు సిబ్బందికి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇన్ లీగ ల్ ప్రాక్టీస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. 15వ అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్‌కు మార్ హాజరై ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇన్ లీగల్ ప్రాక్టీస్ ప్రతి న్యాయవాదికి న్యాయమూర్తులకు, సిబ్బందికి, పోలీసువారు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు.
సైబర్ ల్వాస్, నార్కోటిక్ ఎనాలసిస్, డిజిటల్ ఎవిడెన్స్ అవసర మని చెప్పారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శం కర శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జి రిటా లాల్ చందు, ప్రిన్సిపల్ జూనియర్స్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి ఆరిగే శ్రీనివాస్ కుమార్, ప్రధాన వక్త డా. శ్రీ మోహన్, సీనియర్ న్యాయవాదులు మా దన్న, నరసింహ, అంజన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వై భాస్కర్, నారాయణరెడ్డి, కే మల్లేష్ పాల్గొన్నారు.