29-10-2025 12:13:27 AM
-ఎంజాయ్ కోసం యువత గంజాయ్ వాడకం.
-పొలిటికల్, అధికారుల ఇళ్లల్లోకి ఎంట్రీ
-చాప కింద నీరులా విస్తరిస్తున్న వైనం
-అమాత్యకు మచ్చ రానివ్వకూడదనే అధికారుల విశ్వ ప్రయత్నమా..
-గంజాయి బ్యాచ్ రచ్చతో ఉలిక్కిపడుతున్న జనం
-తాజాగా 8 మంది అరెస్ట్, 735 గ్రాముల గంజాయి స్వాధీనం
నాగర్ కర్నూల్ అక్టోబర్ 28 (విజయక్రాంతి); నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి మత్తు వాడకం చాప కింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. సుమారు 16 ఏళ్ల చిన్నారుల నుండి 30 ఏళ్ల లోపు యువత పూర్తిగా మ హమ్మారీ మత్తులో తూలుతూ బంగారు భ విష్యత్ బుగ్గిపాలు చేసుకుంటున్నారు. సర్వం ధారపోసి తమ పిల్లలను ఉన్నతల్లుగా తీర్చిదిద్దాలని అహోరాత్రులు కష్టపడుతున్న తల్లి దండ్రులకు తీరని షోకాన్ని మిగిలుస్తున్నారు. గ్రూపులుగా మారి విచక్షణారహితం గా ఇతరులపై దాడులకు తెగబడుతూ హంగామా సృష్టిస్తున్నారు.
రాజకీయ పలుకుబడి ఉన్న నేతల పిల్లలు, ఉద్యోగ ఉపాధ్యాయులు, వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ఎదిగిన పిల్లల్లోనూ గంజాయి మత్తు వ్యాధిలా వ్యాపిం చినట్లు సర్వత్రా చర్చ నడుస్తోంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని చైతన్య లాడ్జ్ కేంద్రంగా కిలో బరువుగల ఎండు గం జాయి విక్రయిస్తూ ఎనిమిది మంది యు వత పోలీసులకు పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతుంది. వీరంతా పాతికేళ్ళ లోపు వయసుగల వారు కావడంతో ప్రస్తుతం వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. గంజాయి విక్రయం, సరఫరా అం శం ఇదే ప్రాంతంలో గత పదేళ్లుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి చేయి దాటే స్థితికి చేరిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూ డా రెండేళ్లు గడుస్తున్నా మత్తు పదార్థాల ని యంత్రణ విషయంలో పోలీస్, అబ్కారీ శా ఖ అధికారులు కంటి తుడుపుగా చర్యలు తీసుకోవడంతో ఈ గంజాయి సరఫరా వినియోగం చాప కింద నీరు లాగా విస్తరించి నట్లు తాజా ఘటన సూచిస్తోంది. ప్రస్తుతం పట్టుబడిన యువత చాలాకాలంగా గంజా యి వాడుతున్నట్లు పోలీసుల విచారణలోనే బయటపడింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుబడిన కేసుల్లో నూ ఎక్కువ శాతం నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన యువత ఉండడం విశేషం. కానీ క్రయ విక్రయాలు సరఫరా అంశంలో మా త్రం తమకెలాంటి సమాచారం లేదని చెప్ప డం ఎవరికి అంతు పట్టని ప్రశ్నగా మిగిలిం ది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు ప్రాంతంలోని యువత గంజాయి మత్తులో తూలుతుంటే అధికారులు సమాచారం లేదని చెప్పుకోవడం పట్ల ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పనిచేస్తు న్న ప్రాంతంలో గంజాయి అంశం బయటపడితే మచ్చ వస్తుందన్న ఉద్దేశంతోనే పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. కళ్ళముందే యువత గ్రూపులుగా విడిపోయి దాడులకు తెగబడుతున్నా తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడం పోలీ స్ శాఖ పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పట్టుబడిన కేసులనూ లోతుగా విచారణ చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది.
పదేళ్లుగా..
గత బిఆర్‌ఎస్ హయాంలో యువజన సంఘాలు, సోషల్ మీడియా వారియర్ పేరుతో కొందరు గ్యాంగ్ లీడర్ అంటూ రీల్స్ చేస్తూ యువతకు గంజాయి అలవాటు చేశారు. అదే కోవలోకి చెందిన నాగర్ కర్నూ ల్ జిల్లా కేంద్రానికి చెందిన గంజాయి బ్యాచ్ భారీగా యువత మద్దతు కూడగట్టి ఓ ప్రధా న రాజకీయ పార్టీ చూపును ఆకర్షించారు. రాజకీయ అండతో మరింత పేట్రేగి ఎంతో మంది యువతను తన వెంట తిప్పుకుంటూ ఎంజాయ్ కోసం గంజాయికి బానిసగా మా ర్చాడు. ఆలస్యంగా తేరుకున్న యువత అ మత్తు నుంచి బయటపడలేక తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. మరి కొంతమంది తల్లిదండ్రులు ఈ అంశాన్ని గుర్తించినప్పటికీ చేసేదేమీ లేక లోలోపలే మదన పడుతున్నారు.
బీదర్ టూ కందనూల్..!
నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, అ చ్చంపేట, కొల్లాపూర్, వంటి పట్టణాలతో పాటు గ్రామాల్లోకి కూడా గంజాయి వేగంగా విస్తరించింది. గత పదేళ్లుగా విద్యకు, తల్లిదండ్రుల ప్రేమకు దూరమై చిన్న చిన్న కారణాలతో ఇళ్లల్లో గొడవలకు దిగుతూ హంగామా చేస్తున్నారు. పూర్తిగా అలవాటు పడిన యువతకు గంజాయి తప్పనిసరిగా మారడంతో విక్రయదారులు కూడా ఆదా య వనరుగా మార్చుకున్నారు.
గోవా, బీద ర్, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న దూల్పేట్ వంటి ప్రాంతాల నుంచి కిలోల చొప్పున ఎండు గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా 100 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. బీదర్ నుండి ట్రైన్ మార్గం గుండా, జడ్చర్ల, మహబూబ్నగర్ నుండి ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రిళ్ళు ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, ఆలయాలు, అసంపూ ర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల, నిర్మానుష ప్రదేశాల్లో గ్రూపులుగా చేరి గంజాయి సేవిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పీడియాక్టు నమోదు చేసి అణిచివేస్తాం
గంజాయి వినియోగం, సరఫరాపై నిఘా పెంచాం. అత్యంత ప్రమాదకరమైన ఈ మత్తు పదార్థాలను సరఫరా చేసినా, విక్రయించినా, వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయి. జిల్లాలో అందుకోసం ప్రత్యేక టీం ఫా మ్ చేశాం. పిడి యాక్ట్ నమోదు చేసి అ ణిచివేస్తాం. గంజాయి సరఫరా చేస్తున్నట్లు దృష్టికి వచ్చిన వెంటనే పోలీసు లకు సమాచారం ఇవ్వాలి. బాధిత తల్లిదండ్రులు సైతం ముందుకు రావాలి. ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు.
గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్, జిల్లా ఎస్పీ,నాగర్‌కర్నూల్