calender_icon.png 25 December, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వాసికి సైన్స్‌లో ప్రతిష్టాత్మక అవార్డు

25-12-2025 12:27:40 AM

వనపర్తి టౌన్, డిసెంబర్ 24: వనపర్తి పట్టణం కు చెందిన పగడాల అలివేలు,గోపాల్ ల కుమార్తె  డా. పగిడాల సౌజన్య బుధవారం  తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టీ ఎ ఎస్)నుండి ఐ ఐ టి, హైదరాబాద్ డైరెక్టర్ చేతుల మీదుగా అసోసియేట్ ఫెలో అవార్డ్ ను అందుకున్నారు.

ఈ అవార్డ్ ను సైన్స్ లో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా  టి ఎ ఎస్ నుండి వివిధ సైన్స్ రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరచిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇందులో భాగంగా సౌజన్య కు అసోసియేట్ ఫెలో గా గుర్తింపు లభించింది.  ఈ అవార్డ్ తీసుకోవడం తనకెంతో గర్వకారణమన్నారు.  ఈ అవార్డ్ రావడానికి ముఖ్య కారకులైన ప్రొఫెసర్ ఎం వి రమణా రెడ్డి, డా పవన్ కుమార్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.