calender_icon.png 25 December, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాండురంగ ఆశ్రమంలో శతకోటి హరే రామ నామజప యజ్ఞం

25-12-2025 12:27:56 AM

ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు 

వారం రోజులపాటు జరగనున్న జప యజ్ఞం

 గజ్వేల్, డిసెంబర్ 24: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భవానందపూర్ లోని పాండురంగ ఆశ్రమంలో శతకోటి హరే రామ నామ జప యజ్ఞం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధనతో సభక్తికంగా నామోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీ అవధూతేంద్ర స్వామి వారి శిష్య బృందంతోపాటు భగవత్ సేవా సమాజం శాఖలు మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్నాయి. చేర్యాల, దూల్మిట్ట, బైరంపల్లి, నర్సాయిపల్లి, వాసాలమర్రి తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నామ సేవకులు హాజరయ్యారు.

చేర్యాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వాహన శ్రేణిలో భగవాన్ నామం చేస్తూ ఆశ్రమానికి చేరుకున్నారు. ఏడు రోజులపాటు ఆఖండంగా కొనసాగే హరే రామ భజన భక్తుల కరతాల ధ్వనులు నృత్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని రెట్టింపు చేసింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడి నాదామృతాన్ని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏడు రోజులపాటు సాగే ఈ భక్తి చైతన్య మహా యజ్ఞంలో అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు కోరారు.