calender_icon.png 25 December, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ తీగలు తగిలి పశుగ్రాసం దగ్ధం

25-12-2025 12:26:16 AM

అలంపూర్, డిసెంబర్ 24: విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ లో తీసుకెళ్తున్న పశుగ్రాసం అగ్నికి ఆహుతైన ఘటన రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మాన్ దొడ్డి నుంచి గూడూరు మండలం మునగాల గ్రామానికి గడ్డిని ట్రాక్టర్ లో తరలిస్తుండగా మార్గమధ్యలో వేలాడుతున్న విద్యుత్ పేర్లు తగిలి ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో ట్రాక్టర్లో ఉన్న పశుగ్రాసం మొత్తం  కాలిపోయింది. రూ .20వేల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.