25-12-2025 02:40:11 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీశ్రీ అయ్యప్ప ఆలయంలోని పడి మెట్టు కోసం 1,18,000/-ల విరాళాన్ని బిజెపి నాయకుడు అయ్యప్ప భక్తుడైన సాయిరాం గౌడ్ ప్రదేశం.
గతంలో నిర్వహించిన మహా పడిపూజలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈ విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా బిజెపి నేత సాయిరాం గౌడ్ లక్ష 18 వేల రూపాయల చెక్కును ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి చంద్రం స్వామి, ఆలయ పూజారి శ్రీనివాస స్వామి, నగేష్ గురు స్వామి, మాజీ వైస్ ఎంపీపీ నువ్వుగొండ శ్రీనివాస్, యాదగిరి స్వామి, సంతు స్వామి తదితరులు పాల్గొన్నారు.