calender_icon.png 25 December, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన బూట్ క్యాంప్ సదస్సు

25-12-2025 02:40:20 AM

గురునానక్ ఇనిస్టిట్యూషన్స్‌లో  పీఎంశ్రీ ఉపాధ్యాయులకు సదస్సు

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో రాష్ట్రంలోని పీఎం శ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ ఇండియా రైసింగ్) పాఠశాలల నుంచి 190 మందికి పైగా  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు  కోసం నిర్వహించిన మూడు రోజుల జాతీయ సదస్సు ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (ఐడీ ఈ) బూట్‌క్యాంప్ అనే అంశంపైన గురునానక్ ఇనిస్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ (జీఎన్‌ఐటీసీ)లో విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డా. అభయ్ జెరే, ఏఐసీటీఈ ఉపాధ్యక్షులు, యోగేష్ డి. బ్రహ్మాంకర్, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్లో ఇన్నోవేషన్ డైరెక్టర్, పాల్గొన్నారు. సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ పాల్గొన్నారు.