calender_icon.png 25 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

25-12-2025 02:39:24 AM

ఎస్‌వీఎం సెంట్రల్ పబ్లిక్ పాఠశాలలో నిర్వహణ

ఖమ్మ, డిసెంబర్ 24(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్‌లో గల ఎస్వీఎం సెంట్రల్ పబ్లిక్ పాఠశాలలో బుధవారం  సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థు లు శాంటా క్లాజ్ వేషధారణలో ఆకట్టుకోగా, ఒకరికొకరు కేక్‌లు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హ్యాపీ క్రిస్మ స్ నినాదాలతో స్కూల్ ప్రాంగణం మారుమోగింది. పాఠశాల డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన ప్రే మ మార్గం సర్వకాలం ఆచరణీయమైనదని, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సిద్ధపడిన జీసస్ గొప్పతనం నుంచి ప్రతి ఒక్క రూ స్ఫూర్తి పొందాలని అన్నారు.

డైరెక్టర్ ఉమ మాట్లాడుతూ మీ చుట్టూ ఉన్న నిరుపేదలకు మరియు అవసరంలో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయాలని, ఇతరుల పట్ల కోపాన్ని వీడి ప్రేమతో మెలగడం నేర్చుకోవాలని అన్నారు. మరో డైరెక్టర్ సురేష్ బా బు మాట్లాడుతూ వెలుగునిచ్చే నక్షత్రంలా మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలని, కష్టపడి చదవాలని విద్యార్థులకు సూ చించారు.  కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, టీచర్లు పాల్గొన్నారు.