calender_icon.png 31 July, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనంద్, అర్జున్‌లకు డ్రా

06-10-2024 12:00:00 AM

గ్లోబల్ చెస్ లీగ్

లండన్: విశ్వనాథన్ ఆనంద్ నేతృత్వం వహిస్తున్న గ్యాంగ్స్ గ్రాండ్ మాస్టర్స్‌కు గ్లోబల్ చెస్ లీగ్‌లో కలిసి రావడం లేదు. ఆ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసింది. పీబీఎస్ అలాస్కన్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 తేడాతో  పరాజయం పాలైంది. విశ్వనాథన్ ఆనంద్‌తో పాటు ప్రపంచ మూడో ర్యాంకర్ అర్జున్ ఇరిగేసి డ్రాతో సరిపెట్టుకోగా.. వైశాలీ ఓటమి మూటగట్టుకుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పీబీజీ అలస్కాన్ నైట్స్ నాలుగు విజయాలతో పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. గ్యాంగ్స్ గ్రాండ్ మాస్టర్స్ బోణీ కొట్టలేక చివరి స్థానంలో కొనసాగుతోంది.