calender_icon.png 13 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరుగారుతున్న లక్ష్యం

11-05-2025 11:50:47 PM

  1. ఆది నుంచి చతికిలబడిన కాలువ పనులు 
  2. పూర్తి స్థాయి ఆయకట్టుకు అందని సాగునీరు 

భద్రాద్రి కొత్తగూడెం మే 11 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం--చల్ల మండలాల సరిహద్దు ప్రాంతం లోని తాళి పేరు ప్రాజెక్టు ఆర్ సి సి ఛానల్ లక్ష్యం నేరుగారితోంది. సుమారు 3100 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1998 లో ప్రారంభించిన తల్లి పేరు ఆర్సిసి ఛానల్ లీకులమయంగా మారి రైతులకు సాగునీరు అందించడం లేదు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద నిర్మాణంగా పేరుగాంచిన మారేడు బాకా లో ఆర్ సి సి ఛానల్ శిథిలావస్థకు చేరి రైతుల పాలు శాపంగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని ఎల్డి 4పై నిర్మించిన ఈ ఆర్ సి సి ఛానల్ ఆయకట్టు చివర ఉన్న సింగారం, గంగా రం ,నిమ్మలగూడెం, ఎన్ లక్ష్మీపురం, పాలూరిపేట ప్రాంతాల్లో మూడు వేల ఒక వంద ఎకరాలకు సాగునీరు అం దించాల్సి ఉంది.

1998లో చేపట్టిన నిర్మాణం పట్టుమని రెండు సంవత్సరాలు మాత్రమే కాలువల ద్వారా సాగునీరు అందింది. ఆ తర్వాత 2019లో కాలువలకు గండ్లు పడటం ద్వారా సాగునీరు సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో తవ్విన కాలువలు కేవలం అలంకారప్రాయంగా మిగిలాయి.

దీంతో తాళి పేరు ఎడమ కాలువలో భారీగా పోడిక ఏర్పడడం తోపాటు ఆ యకట్టు పెరగడంతో ఎల్డి 4లో ఆర్ సి సి ఛానల్ కలిపే ప్రాంతం వరకు సాగునీరు అందడం లేదు. కాలువ ఎగువన వానాకా లం పంట పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆర్ సి సి ఛానల్ వరకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఆర్ సి సి ఛానల్ శిధి లమై నేరు వృధాగా పోతున్న అధికార యం త్రాంగం పట్టించుకోవడం లేదని, మన మతలపై దృష్టి సారించడం లేదని లేదని రైతుల ఆరోపిస్తున్నారు.

వచ్చే వర్షాకాలం నాటికైనా ఆర్సీసీ ఛానల్ మరమ్మతులు పూర్తి చేసి కా లవ చివరి వరకు ఉన్న భూములకు సాగునీ రు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై తాళి పేరు ప్రాజెక్టు ఈ ఈ ఎస్ డి అహమ్మద్ జానీ ని వివరణ కోరగా నెలరోజుల క్రితమే తాను బాధ్యతలు చేపట్టానని, దుమ్ముగూడెం మండల కు చెందిన ఆర్సీసీ కెనాల్ అంశం తన దృష్టిలో లేదన్నారు. తెలుసుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తానన్నారు.