09-01-2026 12:44:10 AM
రోగుల ప్రాణాలతో చెలగాటం అరెస్టు అయినా బయటకు వచ్చి మళ్ళీ వైద్యం
తనిఖీలు చేయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
మేడ్చల్, జనవరి 8 (విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకున్నప్పటికీ డాక్టర్లుగా వైద్యం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేయనందున నకిలీ వైద్యులు పుట్టుకొస్తున్నారు. ఎవరు ఎవరు చెప్పండి పోలీసులు, రాష్ట్ర వైద్య మండలి అధికారులు తనిఖీలు చేసి నకిలీ డాక్టర్లను పట్టుకుంటున్నారు.
తాజాగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో పోలీసులు ఒక నకిలీ వైద్యుని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం మేడ్చల్ పోలీసులు కిష్టాపూర్ కు చెందిన రాజు అనే పిఎంపిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఒరిస్సా కు చెందిన కార్మికుడికి అధిక డోసు ఇచ్చి మృతికి కారకుడైనందున పోలీసులు రాజును అరెస్టు చేశారు.
ఉప్పల్ చిలక నగర్ లో సింధు పాలీ క్లినిక్ లో కనీస వైద్య అర్హతలు లేని కిరణ్మయి, బాల సిద్ధులను ఎస్‌ఓటి పోలీసులు పట్టుకొని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. బాల సిద్ధులు గతంలో ఒక బాలిక మృతికి కారణమైనందున మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అయినప్పటికీ మళ్లీ వైద్యవృత్తి కొనసాగించాడు. రాష్ట్ర వైద్య మండలి అధికారులు జూలైలో బరంపేట్ దుండిగల్ సూరారం ప్రాంతాల్లో పలు క్లినిక్లను తనిఖీ చేసి నకిలీ వైద్యులను గుర్తించారు.
మోతాదుకు మించి మందులు ఇస్తున్న నకిలీ డాక్టర్లు
నకిలీ డాక్టర్లు మోతాదుకు మించి మందులు ఇస్తున్నారు. అధిక దోస్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. యాంటీబయటిక్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లు, ఐ వి లూయిస్ లు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇవి రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పెద్ద ఆస్పత్రులలో దోపిడీలు చేస్తున్నందున రోగులు కాలనీలలో పిఎంపి లను ఆశ్రయిస్తున్నారు. పెద్ద ఆసుపత్రికి వెళ్తే మామూలు జ్వరానికి కూడా 2000 రూపాయల బిల్లు అవుతుంది. అవసరం లేకుండా టెస్టులు రాస్తున్నారు.
బెడ్లు వేసి చికిత్స
పీఎంపీలు తమ ఆసుపత్రులలో బెడ్లు వేసి చికిత్స చేస్తున్నారు. పెద్ద ఆస్పత్రుల తర హాలో వైద్యం చేస్తున్నారు. కొన్నింటిలో స్కానింగ్ మిషన్ లు ఉంటున్నాయి. పక్కనే మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. రోగులు తప్పనిసరిగా అందులోనే మందు కొట్టు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెద్ద ఆసుపత్రులకు పీఎంపీలు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు. కొన్ని కేసులను అక్కడికి పంపి కమిషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి నకిలీ వైద్యు ు్యల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది.