03-09-2025 12:00:00 AM
విద్యార్థులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
చేగుంట,సెప్టెంబర్ 1 :విద్యాబుద్దులు నే ర్పించాల్సిన ఓప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను తీవ్రంగా దండించడమే కాకుండా వి ద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన సం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.
విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా చేగుంట మండ లం కరీంనగర్ ప్రాథమిక పాఠశాలలో పూర్ణచందర్ ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడి గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పా ఠశాలలో విద్యార్థులను ప్రతి చిన్న విషయానికి దండిస్తూ బూతులు తిడుతూ, అసభ్య ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు గతనెల 11న పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుని నిలదీశారు.
దీంతో పూర్ణచందర్ తనకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, నన్ను ఎవరు ఏమి చేయ లేరని చెప్పి పాఠశాల నుండి వెళ్లి ఇప్పటి వరకు రాలేదని తెలిపారు.
గజ్వేల్/ హుస్నాబాద్/ సిద్దిపేట రూరల్/ నంగునూరు/ చేర్యాల/ కొమరవెల్లి, సెప్టెంబరు 1: కాలేశ్వరం ప్రాజెక్టుపై గోష్ కమిషన్ సమర్పించిన నివేదిక తప్పులతడుక అంటూ సిద్దిపేట జిల్లాలో సోమవా రం భారత రాష్ట్ర సమితి నాయకులు నిరసనకు దిగారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి అన్నదాతగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు.
అసెంబ్లీలో చర్చ చేసి సీబీఐకి అప్పగించడం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. కాలేశ్వరం జలాలతో అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేసి నివాళులర్పించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉదృతం చేస్తామంటూ హెచ్చరించారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపడంతో భారీ సంఖ్య లో వాహనాలు నిలిచిపోయాయి.