27-12-2025 12:05:58 AM
పట్టణంలో సిపిఐ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ
మణుగూరు,డిసెంబర్ 26,(విజయక్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ వందేళ్ళ పండగ వాడవాడల ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సిపిఐ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మణుగూరు మండలం లో..కమ్యూనిజం అజరామారం అని మనిషి మనుగడ ఉన్నంతవరకు కమ్యూనిస్టులు ఉంటారని ఈ వందేళ్లపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనేక పోరాటాలు,త్యాగాలు చేసిందని రాబోయే వందేళ్లు కూడా అను నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి అన్నారు.
శుక్రవారం సిపిఐ వందేళ్ళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద అరుణ పతాకాన్ని పుల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వాడవాడలా నాయకులు ఎర్ర జెండాలను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ,సిపిఐ వందేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్బంగా జనవరి 18న ఖమ్మం నగరంలో జరిగే శతవసంతాల ముగింపు బహిరంగ సభకు ప్రతి పల్లె, పట్టణం నుంచి దండుగా కదలాలని, అందుకోసం పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలన్నారు.
సిపిఐ శతవసంతాల ఉత్సవాలు కేవలం పార్టీ వేడుకలుగా కాకుండా, ప్రజల ఉద్యమ చరిత్రను గుర్తు చేసే సమయంగా వుండాలని, అందుకు పార్టీ శ్రేణులు సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ప్రజల పండుగగా మార్చాలని పిలుపు నిచ్చారు.ఈ కార్య క్రమంలో మున్నా లక్ష్మీకుమారి,ఆర్ లక్ష్మీ నారాయణ, దుర్గాల సుధాకర్,రామ్ గోపా ల్,సాంబాయిగూడెం సర్పంచ్ చీడం ఉషరాణి, ఉపసర్పంచ్ పులిగిల్ల రమేష్, రామంజవరం మాజీ సర్పంచ్ బాడిశ సతీష్,మోహన్ రావు,రమేష్, భిక్షం, వెంకటేశ్వర్లు,సీతారాములు, సమ్మ క్క,సుజాత, ప్రమీల,నరేష్, రమేష్ మంగి వీరయ్య పాల్గొన్నారు.