11-09-2025 06:11:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సర్వీస్ పర్సనల్(స్కావెంజర్) కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కార్మికుల సంఘం అధ్యక్షులు కదం మారుతీ డిమాండ్ చేశారు. గురువారం పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిఇఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యా కమిటీ పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభంలో కమిటీ తీర్మానం ప్రకారం పాఠశాల సర్వీస్ పర్సనల్(స్కావెంజర్) కార్మికులను నియమించుకుందని అప్పటి నుండి నేటికి మూడు నెలలు గడిచిన వేతనాలు అందలేదన్నారు.
విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఒకటి నుండి 30 మంది విద్యార్థుల సంఖ్య ఉంటే మూడు వేలు, 30 నుండి 60 మంది విద్యార్థులు ఉంటే ఆరు వేలు, 60 పైకి గా ఉంటే 12000 వేల వేతనాలు ఇస్తామని నియామకం చేసుకొని ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్న 3000 ఇస్తారని చెప్పడం ఎంత వరకు సమాంజనం అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలు నుండి జీతాలు లేకుండా పని చేస్తే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని అన్నారు. జిల్లా కలెక్టర్ విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి జీవో ప్రకారం పెండింగ్ వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పి. సత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండూరు. మల్లేష్, మారుతీ, పోశెట్టి, కవిత, భోజన్న, లక్ష్మి, చంద్రకాంత్, రాణి,నారాయణ,లక్ష్మి, చిన్న సాయన్న, తదితరులు పాల్గొన్నారు.