calender_icon.png 29 January, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిరోజే నామినేషన్ల జోరు

29-01-2026 12:07:15 AM

మరిపెడ, జనవరి 28(విజయక్రాంతి): మరిపెడ మున్సిపాలిటీలోని వార్డులకు బుధ వారం రెండు నామినేషన్లు దాఖలు అయినాయి.6 వార్డు జనసేన పార్టీ నుండి బోడ స్వాతి దామోదర్, నామినేషన్ వేశారు 9వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మావత్ దేవి నామినేషన్ వేశారు. మొత్తం 15 వార్డులకు తొలిరోజు రెండు వార్డులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైనవి.

పరకాలలో ఐదు నామినేషన్లు

హనుమకొండ, జనవరి 28 (విజయ క్రాంతి): పరకాల పురపాలక సంఘంలో 22 వార్డులకు నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది. 22 వార్డులకు గాను అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించేందుకు ఏడు కౌంటర్లను ఏర్పాటు చేయగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించారు. తొలి రోజు బుధవారం 7,11,16,18,20 వార్డులకు ఒక్కో నామినేషన్ చొప్పున ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, పురపాలక కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.

నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

మరిపెడ, జనవరి 28(విజయక్రాంతి): మరిపెడ మున్సిపల్ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను బుధవారం రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులకు హెచ్చరించారు. ఆయన వెంట తాసిల్దార్ కృష్ణవేణి ,మున్సిపల్ కమిషనర్ విజయ్ ఆనంద్, ఎన్నికల అధికారులు ఉన్నారు.

నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి

జనగామ: నామినేషన్ పత్రాలను క్షుణ్ణం గా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం నుండి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయినందున జనగామ లో ని మున్సిపల్ కార్యాయలం, స్టేషన్ ఘ న్పూర్ లో జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల ఆవరణలను  బుధవారం అదనపు కలెక్టర్ ప్రాంతా ల్లో పర్యటించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నందున  అభ్యర్దులు నామినేషన్లు వేసేందుకు  ఇబ్బందులు కలుగకుండా ఒక్కొక్క వార్డుకు మూడు కౌంటర్ల చొప్పున 10 కౌంటర్లు, అలాగే స్టేషన్ ఘన్ పూర్లో మొత్తం 18 వార్డులు ఉండగా, ఒక్కొక్క వార్డుకు మూడు నామినేషన్ కౌంటర్ల చొప్పున  6 కౌంటర్లను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ నెల 30వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 

ఉదయం 10.30 గంటల నుండి సాయం త్రం 5.00 గంటల వరకు స్వీకరిస్తారని అన్నారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్దు లు ఎన్నికల  నిబంధనల సూచనల మేరకు అవసరమైన దృవీకరణ పత్రాలను నామినేషన్తో తప్పక సమర్పించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, అలాగే నామినేషన్ల స్వీకరణ పై పూర్తి అవగాణ కలిగి ఉండాలని అన్నారు, అలాగే రిటర్నింగ్ అధికారులు అందరు సమన్వయంతో ఒక టీమ్ వర్క్ గా విదులు నిర్వహించి. విజయవంతంగా చేయాలని అన్నారు. అలాగే పలు సూచనలు, సలహాలతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి పై అదనపు కలెక్టర్  దిశనిర్దేశం చేశారు.