calender_icon.png 29 January, 2026 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లారెడ్డివి అన్ని ఉత్తుత్తి మాటలే..

29-01-2026 12:07:20 AM

శామీర్‌పేట్, జనవరి 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ ఇంచార్జ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అన్నారు. బుధవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పోతారం చౌరస్తా లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడరు.... ఈ నెల 11 న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్దులని భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు.

స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇక్కడి ప్రజలను 10 సంవత్సరాలుగా పట్టించుకోలేదని కేవలం ఆయన విద్యాసంస్థలు కాపాడుకోవడానికి ఇక్కడి ప్రజలను అడ్డుపెట్టుకుంటున్నాడని విమర్శించారు. బోకర్ మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్ కు బుద్ధి చెప్తారని ధీమా  వ్యక్తం చేశారు. పార్టీకి కష్టపడి పని చేసిన వారికి టికెట్ ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, జవహర్ నగర్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ , లక్ష్మారెడ్డి, వీరేశం, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జేయల పాండు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.