calender_icon.png 12 September, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం నీళ్లు లేకుండానే సాగు

16-12-2024 01:41:57 AM

* కోటి 53 లక్షల టన్నుల వడ్లు పండించాం

* ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల, డిసెంబర్ 15 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క లీటరు నీటిని ఉపయోగించకుండా కోటి 53 లక్షల టన్నుల వడ్లను పండించామని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ ఆర్థిక దోపిడీకి పాల్పడిందని, బీఆర్‌ఎస్ హయాంలో రైతులు చాలా నష్టపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచిందన్నారు. 89 శాతం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 155 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశామన్నారు. అంతకుముందు ఐబీ చౌరస్తాలో నిర్మాణమవుతున్న మాతా శిశు కేంద్రం, వైకుంఠ ధామం నిర్మాణాలను ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పరిశీలించారు.