calender_icon.png 6 October, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలాల్లో పూడికతీత చేపట్టాలి: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

06-10-2025 12:00:59 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 5 : ఇటీవల కురిసిన వర్షాలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో అనేక కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ధ్వంసం కావడంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే స్పందించి నాలాల్లో పూడికతీత పనులు చేయించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీలో 15 రోజులుగా ఎస్‌ఎన్ డీపీ నాలా మురుగునీరు క్యాచ్ ఫిట్స్ ద్వారా పొంగిపోర్లుతుంది.

మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో కాలనీవాసులు ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి గ్రీన్ పార్క్ కాలనీలో పర్యటించారు. సమస్య పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశా రు. ఎస్‌ఎన్ డీపీ నాలాలో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

అవసరమైతే ఎస్‌ఎన్ డీపీ నాలా స్లాబ్ తొలిగించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సరూ ర్ నగర్ చెరువు ముఖద్వారం వద్ద పేరుకుపోయిన సిల్ట్‌ను సైతం వెంటనే తొలగించా లని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  శివగంగా థియేటర్ వద్ద ఉన్న ఎస్ ఎన్ డీపీ ఔట్ లేట్ సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తిలక్ రావు, జగన్నాథ్‌రెడ్డి, నాయకులు మధుసాగర్, ప్రకాశ్, ఇంద్రజీ, అనిల్, ప్రసాద్, శ్రీకాంత్, అరుణ్, యశ్వంత్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జగన్ రెడ్డి, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రాఘవేందర్ రెడ్డి, సురేశ్, శేఖర్, నారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి, రామ య్య, సువర్ణ, యాదాలక్ష్మి పాల్గొన్నారు.