08-11-2025 05:22:35 PM
కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు..
భారీ స్థాయిలో రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు..
మహబూబ్ నగర్ టౌన్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణుల సమన్వయంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్. పి. వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ "ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం ప్రజాసేవలో సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని, పేద, మధ్యతరగతి, బలహీన వర్గాల సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి రాములు యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, సిజే బెనహార్, ఏర్పుల నాగరాజు, నాయకులు తిరుమల వెంకటేష్, రామకృష్ణ, చెన్నయ్య, చంద్రమౌళి, యాదిరెడ్డి, కిషన్ నాయక్, ఖాజా, చందు యాదవ్, కుమార్, దోమ పరమేశ్, గోవింద్ యాదవ్, అలీం, వర్థ రవి, పాతూరి రమేష్, జె.వెంకటయ్య, శ్యాం, కలీం తదితరులు పాల్గొన్నారు.