calender_icon.png 25 December, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కండ్లకోయలో సర్వదోషనివారణ మహా యజ్ఞం

25-12-2025 02:54:58 AM

మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 24 (విజయక్రాంతి):గుండ్లపోచంపల్లి గ్రేటర్ హైదరాబాద్ సెంటర్లోని కండ్లకోయ ప్రాంతంలో గల శ్రీ సాయిగీతా ఆశ్రమంలో సర్వదోష నివారణ మహా యజ్ఞం కార్యక్రమం జరుగుతోందని ఆశ్రమ మేనేజర్ శ్రీనివాస్ రావు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ దోష నివారణ మహా యజ్ఞం ఒక అరుదైన విశేషమైన యజ్ఞం ప్రకృతిని ఆరాధిస్తూ విశ్వశాంతిని వ్యక్తిగత శాంతిని ఆకాంక్షిస్తూ 540 పై గల దేవత వృక్షాల ఛాయలో జరిగే అద్భుతమైన యజ్ఞమని ఆయన తెలిపారు .

ఈ నేపథ్యంలో యజ్ఞం గత 60 సంవత్సరాలుగా పూజ్య సద్గురు డాక్టర్ సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.   భక్తులు ఆశ్రమంలో నెలకొనియున్న రావి,జమ్మి,ఉసిరి,రుద్రాక్ష కృష్ణ,మర్రి నాగలింగ,యమాలార్జునా మొదలగు దివ్య వృక్షాలలో హోమాలు పూజలు నిర్వహించుకొని ఆధ్యాత్మికంగా ఉన్నతిని భక్తి వైరాగ్యములను పొందగలరని ఆశిస్తున్నట్లు ఆయన కోరారు.

కండ్లకోయ సమీపంలో గల శ్రీ సాయిగీతా ఆశ్రమంలో 540 వృక్ష దేవతల సమక్షంలో 61వ సర్వదోష నివారణ మహా యజ్ఞం నిర్వహించబడుతుందని ఆఖరి తేదీ 28వ రోజు ఉదయం 11 గంటల నుండి పూజ సద్గురు దివ్య సందేశం తనంతరం సామూహిక కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం కొనసాగుతుందని ఆశ్రమ మేనేజర్ శ్రీనివాస్ రావు తెలియజేశారు...