calender_icon.png 4 October, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాములు యాదవ్ కు ఘనంగా సన్మానం

04-10-2025 06:36:49 PM

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ లోని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ నివాసంలో ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం నాయకులు కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాములు యాదవ్ మాట్లాడుతూ యాదవ హక్కుల పోరాట సమితి అనేది యాదవ (గొల్ల, కురుమ) కమ్యూనిటీ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం కృషి చేస్తున్న ఒక జాతీయ స్థాయి సంస్థ అని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ సమితి క్రియాశీలకంగా ఉందని యాదవుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. యాదవ కమ్యూనిటీ ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ఒక ప్రత్యేక యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఈ సమితి గట్టిగా డిమాండ్ చేస్తోంది. కార్పొరేషన్‌కు ప్రతి బడ్జెట్‌లో ₹5000 కోట్ల వరకు నిధులు కేటాయించాలని కోరారు.

రాజకీయ ప్రాధాన్యత రాష్ట్రంలో యాదవ జనాభా దామాషా ప్రకారం, వివిధ రాజకీయ పార్టీలు చట్టసభల్లో (అసెంబ్లీ, మండలి) యాదవులకు తగినన్ని సీట్లు కేటాయించాలని, అదే విధంగా నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు ఇవ్వాలని తెలిపారు. ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం అధ్యక్షుడు కొండ ఐలయ్య మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ నాయకత్వంలో ఈ సమితి క్రియాశీలకంగా పనిచేస్తూ, "యాదవులే కాబోయే పాలకులు" అనే నినాదంతో కమ్యూనిటీలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అని తెలిపారు. యాదవ కమ్యూనిటీకి సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగాలలో మెరుగైన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ సమితి పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు ఐలయ్య యాదవ్, మాజీ అధ్యక్షులు నర్సింగ్ యాదవ్, ఉపాధ్యక్షులు వీరేష్ యాదవ్ ,రిపోర్టర్ వెంకన్న యాదవ్, మురళీమోహన్ యాదవ్, రాజు యాదవ్, సత్తయ్య యాదవ్, అమూల్య మల్లికార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు.