calender_icon.png 4 October, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీజినల్ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన జీఎం

04-10-2025 06:40:25 PM

ఇల్లెందు (విజయక్రాంతి): వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ 2025-26 ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో నిర్వహించిన రీజినల్ స్థాయి (మణుగూరు, ఇల్లందు ఏరియా) క్రీడా పోటీలను ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు ఆడడం వల్ల శారీరక దారుఢ్యం, మానసిక ఒత్తిడి పెంపొందించుకోవచ్చని, ఉద్యోగులు తమ రోజువారి విధులలో భాగంగా ప్రతిరోజు 30 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చేయాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని, క్రీడల వల్ల క్రీడాకారులకు ఒక క్రమశిక్షణ ఏర్పడుతుందని, ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా ఈ క్రీడలను నిర్వహిస్తుందని తెలిపారు.

యువ ఉద్యోగులు క్రీడలపై మక్కువ చూపి క్రీడలలో రాణించి ఇల్లందు ఏరియాకు మంచి పేరును తీసుకురావాలని కోరారు. తదుపరివారు క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ, బాల్ బాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జిఎం డి.రామస్వామి, యాక్టింగ్ డీజిఎం పర్సనల్ బోడ శ్యాంప్రసాద్, అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ జే.వెంకటేశ్వర్లు, సీనియర్ పి.ఓ అండ్ క్రీడల కార్యదర్శి వి.అజయ్, క్రీడల సమన్వయకర్త కాలవల వెంకటేశ్వర్లు, జనరల్ కెప్టన్ దాట్ల శ్రీకాంత్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.