30-04-2025 05:46:19 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల కలకోవ సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి మండవ శాంతి బాబు సంతాప సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మండవ శాంతి బాబు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ నివాళులర్పించారు. బుధవారం ఇటీవల అకాల మరణం చెందిన సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి మండవ శాంతి బాబుకు ఏర్పాటు చేసిన సంతాప సభ కొంపెల్లి లింగయ్య అధ్యక్షతన జరిగినది. ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పాల్గొని మాట్లాడుతూ... తన తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఎర్ర జెండా పక్షాన ప్రజా సమస్యలపైన వాటి పరిష్కారం కొరకు పేదల పక్షపాతిగా నిరంతరం కృషి చేసేవాడని, సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ చిన్న వయసులోనే ప్రజా మన్ననలు పొందిన వ్యక్తి అని కలకోవ గ్రామంలో ఎర్రజెండాను పూర్వ వైభవం తేవడానికి కృషి చేశారన్నారు.
మునగాల పరగణ ప్రాంతం నాటి తెలంగాణ సాయుధ రైతంగ పోరాట పోరాసత్వాన్నికీ వారసుడుగా పనిచేస్తున్న సమయములో అకాల మరణం చెందడం సిపిఎం పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా శాంతి బాబుకు విప్లవ జోహార్ లరిపిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ... మండవ శాంతి బాబు మరణం సిపిఎం పార్టీకే తీరనిలోటు అని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి, షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, బెల్లంకొండ సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు వెంకటాద్రి, వెంకట కోటమ్మ, స్టాలిన్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరబోయిన వెంకన్న, సతీష్, సుందరయ్య,శేఖర్ రెడ్డి, నాగరాజు, లింగయ్య, ధర్మరాజు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.