calender_icon.png 25 December, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద ఆడపడుచులకు గొప్ప ఆర్థిక భరోసా

25-12-2025 12:38:36 AM

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్, డిసెంబర్ 24: నిరుపేద ఆడబిడ్డల వివాహానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు  గొప్ప ఆర్థిక భరోసాను కల్పిస్తాయని.. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అయిజ మానవపాడు,

ఇటిక్యాల అలంపూర్ మండలాలకు చెందిన  376 మంది లబ్ధిదారులకు రూ.3.76 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ పథకం ద్వారా నిరుపేద ఆడపడుచుల వివాహాలకు గొప్ప ఆర్థిక భరోసాను కల్పిస్తుందని కొనియాడారు. అలంపూర్ ప్రాంత అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు