25-12-2025 12:38:11 AM
350 చర్చిలకు కేకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు, డిసెంబర్ 24: ఏసుక్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని బుధవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో.. నియోజకవర్గ పరిధిలోని 350 చర్చిలకు సొంత నిధులతో కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... దశాబ్ద కాలంగా క్రిస్మస్ పర్వదినం పరిష్కరించుకొని నియోజకవర్గ పరిధిలోని ప్రతి చర్చికి కేకును పంపించి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.
శాంతికి, ప్రేమకు క్రిస్మస్ పండుగ ప్రతీక అని తెలిపారు. సొంత నిధులతో నూతన చర్చిల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో క్రిస్టియన్లకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేష్, పాస్టర్లు అబ్రహం, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.