25-12-2025 02:24:46 AM
కేజీబీవీని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, డిసెంబర్ 24: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గల నస్పూర్‌లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధ వా రం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ మౌనికతో కలిసి కేజీబీవీని తిరిగి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని సూచించారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోషక విలువలు కలిగిన మెనూ అమలు చేస్తుందని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన అల్లికలు, కళాకృతులను పరిశీలించి పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పది వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఏకాగ్రతతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని కోరారు.