25-12-2025 02:23:27 AM
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకుపైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) కొత్త విద్యుత్ బిల్లింగ్ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశా యి. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కా మర్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీసీసీఐ), టీఐఎఫ్, టి స్మా, సీఐఏ, ఫెట్సియా తదితర ప్రముఖ పారిశ్రామిక సంఘాలు బుధవారం సంయుక్తంగా మీడి యా సమావేశం నిర్వహించాయి.
ఆయా విధాన పరమైన నిర్ణయాల్లో పారిశ్రామిక సంఘాలను భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశాయి. కొత్త విధానాల వల్ల విద్యుత్ ఖర్చులు పెరగ డం, పరిశ్రమల బదిలీ అనిశ్చితి, గ్రీన్ ఎనర్జీ పెట్టుబడు లు నిలిచిపోవడం వల్ల పెట్టుబడిదారుల వి శ్వా సం దెబ్బతిని ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమా ద ముందని పరిశ్రమ ప్రతినిధులు హెచ్చరించారు.
కేవీఏఆర్‌హెచ్‌కు మారడమే సమస్య
డిస్కమ్‌లు అకస్మాత్తుగా కేడబ్ల్యూహెచ్ బిల్లిం గ్ నుంచి కేవీఆర్‌ఏహెచ్ బిల్లింగ్‌కు మారడమే ప్రధాన ఆందోళనగా పరిశ్రమలు పేర్కొన్నా యి. ఈ విధానంలో విద్యుత్ వినియోగంతో పా టు పవర్ ఫ్యాక్టర్ కూడా పరిగణనలోకి వస్తుందని, పవర్ ఫ్యాక్టర్ సరిగా లేకపోతే వినియోగం పెరగకపోయినా బిల్లులు 10 నుంచి 20 శాతం వరకు పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు గ్రిడ్‌కు సహకరించిన లీడ్ కేవీఏఆర్‌హెచ్‌పై ఛార్జీ లు విధించడం వల్ల కొన్ని పరిశ్రమలకు బిల్లులు మూడు నుంచి ఐదు రెట్లు పెరిగాయని సంఘా లు ఆరోపించాయి.
కేవలం మూడు నెలల ముం దస్తు నోటీసుతోనే ఈ విధానాన్ని అమలు చేయ డం అన్యాయమన్నాయి. కొత్త బిల్లింగ్ విధానాన్ని దశలవారీగా అమలు చేయాలని డిమాండ్ చేశా రు. చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం చిన్న పరిశ్రమలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని, ముందు గా అవగాహన కల్పించకుండా అమలు చేయడం సరికాదన్నారు.
కనీసం ఆరు నెలలు వాయిదా వేయాలని కోరారు. ఫెట్సియా అధ్యక్షుడు రాజమహేంద్రరెడ్డి మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఐలా -గాంధీనగర్ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ... రూ.15 వేల బిల్లు చెల్లించిన యూనిట్లకు ఇప్పుడు రూ.45 వేల బిల్లులు, రూ.లక్ష చెల్లించిన వారికి రూ.2 లక్షల వరకు బిల్లులు వస్తున్నాయని అన్నారు. ఎఫ్‌టీసీసీఐ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడు తూ... ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు, కానీ పరిశ్రమలకు సరిపడా సమయం ఇవ్వాలని స్పష్టం చేశారు.
రాత్రి విద్యుత్ వినియోగానికి ఉన్న రూ.1.50 యూనిట్ రాయితీని పునరుద్ధరించాలని లేదా పగటి వేళ ఎక్కువ రాయితీ ఇవ్వాలని పరిశ్రమల సంఘాలు కోరాయి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాం డ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) కింద ఓఆర్‌ఆర్ వెలుపలికి పరిశ్రమలను తరలించే అంశంపై స్పష్టత లేదని సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి మా ట్లాడుతూ.. కొత్త పరిశ్రమల ప్రాంతాల్లోని వాస సౌకర్యాలు లేకుంటే కార్మికులు రోజుకు ఐదారు గంటలు ప్రయాణించాలని, ఇది సాధ్యం కాదన్నారు.