calender_icon.png 25 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే ఎన్నికలను బహిష్కరిస్తాం..

25-12-2025 02:23:30 AM

కొలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోనేరావు హెచ్చరిక

ఉట్నూర్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొలం గిరిజనులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణాన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని కొలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనారావు హెచ్చరించారు. బుధవారం ఉమ్మ డి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కొలం గిరిజనులు  ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని, ఐటీడీఏ పిఓ అందుబాటులో లేకపోవడంతో పిఓను కలవలేకపోయామని వాపోయారు.

ఈ సందర్భంగా సోనే రావ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఆదిమ గిరిజనకు చెందిన కొలం గిరిజనులకు ప్రత్యేకంగా పక్కా ఇళ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో కొలం గిరిజనులు ఇండ్ల నిర్మాణ పనులు  ప్రారంభిస్తే వాటినే అటవీ శాఖ అధికారులు  అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇండ్ల నిర్మాణంపై ఐటిడిఏ ముందు  ధర్నా చేస్తే ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు, ఐటిడిఏ పిఓ లు  ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అడ్డు తొలగిస్తామని చెప్పిన నిర్మాణం పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

పక్కా గృహాలు మంజూరైన తర్వా త పాత గుడిసెలను తొలగించి  పిల్లాపాపలతో చలిలో అల్లాడుతున్నామని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 29న ఐటీడీఏ ముందు మహా ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ ధర్నా కు ఉమ్మడి జిల్లాలోని కొలం గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని  విజ్ఞప్తి చేశారు.  గ్రామాల పటేళ్లు  పాల్గొన్నారు.