calender_icon.png 25 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

25-12-2025 12:39:35 AM

నాగల్ గిద్ద, డిసెంబర్ 24 : నాగల్ గిద్ద మండల పరిధిలోని కరస్ గుత్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన కవితా నారాయణ జాదవ్, ఉప సర్పంచ్ అంబ్రెష్ గడ్డే వార్డు సభ్యులు ప్ర మాణ స్వీకార కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని వారిని శాలువ, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్ కవిత నారాయణ జాదవ్ పనిచేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని సూచించారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, శుభ్రత, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి కరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కరస్ గుత్తి గ్రామ విద్యుత్ ఉపకేంద్రంలో  కరస్ గుత్తి గ్రామానికి సపరేట్ ఫీడర్ ఏర్పాటుచేశారు వాటిని ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, స్టాప్ సమయపాలన పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పాటిల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు సోపాన్ రావు పాటిల్, పంచాయతీ కార్యదర్శి గోపాల్ రెడ్డి, విద్యుత్ ఏఈ మొతిరం, ఏఈఓ స్రవంతి, మాజీ సర్పంచ్ నాగేందర్ రావు, సునీల్ పాటిల్, గంగారెడ్డి, గణపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.