calender_icon.png 10 September, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు మండలాలను ఓ విద్యా డివిజన్‌గా చేయాలి

10-09-2025 01:07:13 AM

టీజీహెచ్‌ఎంఏ వినతి

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ప్రతి నాలుగు లేదా ఐదు మండలాలను కలిపి ఒక విద్యా డివిజన్‌గా పునర్వ్యవస్థీకరించి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ల అసోసియేషన్ (టీజీహెచ్‌ఎంఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రాజభాను చంద్రప్రకాశ్, హేమచంద్రుడు, చీఫ్ అడ్వైజర్ పర్వతీ సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.

ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖలో గత ఇరువై ఏండ్లుగా నిలిచిపోయిన హెడ్మాస్టర్ల పదోన్నతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎస్సీఈఆర్టీ, డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈ తదితర విద్యావిభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన డైట్ లెక్చరర్లు, ఎంఈవోలు, హెచ్‌ఎంలకు పదోన్నతులిచ్చి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.