calender_icon.png 20 November, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టంలో కదిలే చేయి కుటుంబాన్ని నడిపే భుజం

20-11-2025 08:07:39 PM

నకిరేకల్ (విజయక్రాంతి): రోడ్డు పక్కన ఎండ, ధూళిని లెక్క చేయకుండా భారమైన సుత్తిని ఎత్తిపట్టి కష్టపడుతున్న ఈ మహిళ.. స్త్రీలు కేవలం వంటలు, ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాదన్న సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. జీవితం మోసే బాధ్యతలో మాత్రమే కాదు, శ్రమలో కూడా ‘సగభాగం’ కాకుండా సమభాగం తనదే అని ఆమె చూపిస్తోంది. సంప్రదాయ చీరలోనే పురుషులతో సమానంగా కఠినమైన శారీరక శ్రమ చేస్తూ కుటుంబాన్ని నిలబెట్టే ఓ భుజాన ఆమె మోస్తున్న భారమే ఈ దృశ్యం. రోజువారీ కూలీపై ఆధారపడి జీవనం సాగించే వేలాది మహిళల శ్రమను ప్రతిబింబించే ఈ చిత్రం కనిపించని వారి చెమట చుక్కలే మన రోడ్లు, మన ప్రయాణాలకు బాటలు వేస్తాయని గుర్తు చేస్తుంది. శ్రమలోనూ, బలంలోనూ, బాధ్యతల్లోనూ మహిళల పాత్ర సమానమే కాదు అమూల్యం. ఈ దృశ్యం రామన్నపేట మండలంలో విజయక్రాంతి కెమెరాకు చిక్కింది.