29-01-2026 12:00:00 AM
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
జనగామ, జనవరి 28 (విజయక్రాంతి): 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు నిర్వహణ నేపధ్యంలో ప్రజలు ఎన్నికల సంబంధించిన సమస్య , సందేహాలను నివ్తృతి, అ లాగే నిబంధనలు ఉల్లంఘనలపై ఫిర్యాదులను హెల్ప్ డిస్క్ కు ఫోన్ చేయవచ్చని అ దనపు కలెక్టర్ పిoకేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ నందు సెల్ 9390830087 నెంబర్ తో హెల్ప్ డిస్క్ ను ఏర్పాటు చేశామన్నారు.
నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు పూర్తి వివరాలకై ఖచ్చితమైన సమాచారం కోసం మరియు వివరాలకై హెల్ప్ డెస్క్ ను నెంబ ర్ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. అలాగే ఏమైనా సందేహాలు మరియు సమస్యలు ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు, ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరుగుతే కూడా ఫిర్యాదులు చేయవ చ్చని అన్నారు, ఇట్టి హెల్ప్ డిస్క్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు.