calender_icon.png 29 May, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం?

28-05-2025 12:00:00 AM

  1. పేపర్ల పైనే సరఫరా 

బినామీ రైతుల పేరుతో రూ.1.67 కోట్లు?

భద్రాద్రి కొత్తగూడెం, మే 27 (విజయక్రాంతి): రైతులు దళారీల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలులో దగా జోరుగా సాగుతుందనే విమర్శలు వినబడుతున్నాయి. ఒకవైపు తరుగు పేరుతో 2.50 కిలోలు కొనుగోలు కేంద్రంలో అదనంగా తీ సుకుంటున్నారని రైతుల వాపోతున్నారు.

ఇదిలా వుండగా ధాన్య లేకుండా, లారీలు వెళ్లకుండా, మిల్లరుకు ధాన్యం చేరినట్లు బినామీ రైతుల పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసినట్లు కొత్త తరహా స్కాంకు తెర లేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ రక మైన స్కాం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

మండల వ్యాప్తంగా మూడు లారీల ధాన్యం మిల్లులకు పంపకుండా పంపినట్లు అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. దాన్యం కొను గోలు ఇంచార్జ్, మిల్లు యజమాని, సొసైటీ సి ఈ ఓ లు కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. కొ నుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన రైతుల పేరు అతను అమ్మిన ధాన్యం, అతని బ్యాంకు ఖాతా ధాన్యం సరఫరా చేసిన లారీ నెంబర్తో సహా కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ టాగింగ్ చేస్తారు.

ఆ వివరాలు మిల్లు యజమానికి ఆన్లైన్లో చేరుతా యి. లారీ మిల్లుకు చేరిన తర్వాత ఆన్లైన్లో చెక్ చేసుకొని అప్రూవల్ కొడతారు. ఆ త ర్వాత మిల్లు యజమాని నుంచి రైతు ఖాతా లో డబ్బులు జమ అవుతాయి. మండలం లో అందుకు విరుద్ధంగా లారీ లేకుండా దా న్యం పంపకుండా ధాన్యం కొలుగోలు చేసినట్లు బినామీ రైతుల పేరుతో టాకింగ్ చే యడం, దాన్ని మిల్లు యజమాని అప్రూవల్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు మండలంలో చర్చనీయాంశమైంది.

బినామీ రైతుల పేరు తో వచ్చిన పైకాన్ని ముగ్గురు పంచుకున్నట్టు తెలుస్తోంది. మిల్లరు ఆ ధాన్యం స్థానంలో ప్రభుత్వానికి పిడిఎఫ్ (చౌక దుకాణపు బియ్యం) రైసును రీసైక్లింగ్ చేసి ఎఫ్ సి ఐ గోదాముకు తరలిస్తాడు. ఇలా ఒక్కో లారీకి సుమారు రూ 55 లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వం నిర్ధారించిన ధర ప్రకారం క్వింటా ధాన్యం రూ 2,300. లారీలో సుమారు 60 0 బస్తాలు అంటే 24 క్వింటాల ధాన్యం.

ఆ ప్రకారం లారీ ధాన్యానికి రూ. 55 లక్షల వర కు ఉంటుంది.అంటే మూడు లారీలకు సుమారు రూ 1.65 కోట్ల వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పాల్వంచ సహకార సంఘం సీఈఓ శ్రీనును వివరణ కోరగా అలాంటి అక్రమాలు ఏమీ జరగలేదన్నారు.

నాగారం కొనుగోలు కేంద్రం నుంచి లారీలకు బదు లు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం మిల్లుకు పం పడం జరిగిందని, అసలు ధాన్యం లేకుండా, లారీలు పంపకుండా ధాన్యం కొనుగోలు చేసినట్లు మిల్లర్ అప్రూవల్ చేయడం అసా ధ్యం అన్నారు. పాల్వంచ సహకార సంఘం దాన్యం కొనుగోలు లో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు.