calender_icon.png 3 July, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షానికి నేలకొరిగిన భారీ వృక్షం

02-07-2025 07:45:34 PM

ఒక ఆటో, బైక్ ధ్వంసం..

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్(Toopran RTC Bus Stand) ముందు పెద్ద మసీదు ప్రక్కన మెయిన్ రోడ్డు ప్రక్కన ఆదిత్య షాపింగ్ మాల్ ముందు కొన్ని ఏళ్ల భారీ వృక్షం నేలకొరిగి ఒక ఆటో, బైక్ ధ్వంసం అయ్యింది. గత మూడు రోజులుగా ఎరతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి బుధవారం ఉదయం నేలకొరిగింది. దీనితో బైక్, ఆటో, రిక్షా పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. చెట్టు నేలకొరిగిన సమయంలో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఎవరు లేరు దీనితో భారీ పెను ప్రమాదం తప్పింది. దీనితో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్లియరెన్స్ చేశారు.