calender_icon.png 15 August, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పోరాటాల్లో సీపీఐకి వందేళ్ల చరిత్ర

15-08-2025 12:14:02 AM

వనపర్తి టౌన్, ఆగస్టు 14 : ప్రజా పోరాటాల్లో సిపిఐ కి వందేళ్ళ చరిత్ర ఉందని మరే రాజకీయ పార్టీకి ఇంత ఘన చరిత్ర లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే శ్రీరామ్ అన్నారు. గురువారం వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను విడుదల చేసి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో 1925, డిసెంబర్ 26న సిపిఐ ఆవిర్భవించి స్వాతంత్య్రం కోసం అలుపెరు గని పోరాటం చేసిందన్నారు.

సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పిలుపు ఇచ్చిన తొలి పార్టీ సిపిఐ మాత్రమే అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కోసం సిపిఐ సాగించిన పోరాటం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. అంతటి చరిత్ర గల సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభలు మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లా పూర్ మండలం గాజుల రామారంలో ఈనెల 19 నుంచి 22 వరకు జరుగుతుందని జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

సీనియర్ నేత కళావతమ్మ, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్,సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ,చిన్న కురుమన్న, జయమ్మ, శిరీష, రాంబాబు, మహేష్, వంశి, విష్ణు, జ్యోతి, మైబుసు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.