15-08-2025 12:12:11 AM
కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
రాజాపూర్ ఆగస్టు 14: రాత్రి కురిసిన భారీ వర్షానికి దుందుభి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దుందుభి వాగు పరివాహక గ్రామమైన ఈద్గాన్ పల్లి గ్రామ శివారులో రైతు దరమోని మల్లేష్ తన పశువులను వాగు ఒడ్డున కట్టేసి బుధవారం రాత్రి ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు వరద ప్రవాహం పెరిగి పశువులు వాగు లోపల చిక్కుకున్నాయి గురువారం ఉదయం మల్లేష్ వెళ్లి చూడగా తన పశువులు వాగులో ఉండిపోయాయని రాజాపూర్ ఎస్సై శివానంద్ గౌడ్ సమా చారం అందించారు.
పోలీసులు వెంటనే స్పందించి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పోలీసులు కలిసి పశువులను వరద ప్రవాహం నుండి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు పోలీస్ సిబ్బందికి ఎన్డిఆర్‌ఎఫ్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు