26-12-2025 12:58:31 AM
భద్రత విధులతోపాటు భక్తి భావన
గరిడేపల్లి,డిసెంబర్ 25,(విజయ క్రాంతి) : మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన బత్తిని సుధాకర్ కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ శబరిమలై క్షేత్రంలో విధులు నిర్వహిస్తూ పార్వతి మాత వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లో జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్,అయ్యప్ప స్వాములకు రక్షణగా భద్రతా సేవలు అందిస్తూనే పార్వతి మాత వేషధారణలో దర్శన మిచ్చి భక్తుల హృదయాలను ఆకట్టుకున్నారు.
అయ్యప్ప స్వా మి మాలధారణతో వచ్చే భక్తుల మధ్య అయ్య ప్ప స్వామి తల్లి పార్వతి దేవి వేషంలో సుధాకర్ దర్శనమివ్వడం శబరిమలలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.ఈ సందర్భంగా ఆయన వేషధారణను చూసిన అయ్యప్ప భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి,జయజయ ధ్వానాలతో హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణకు చెందిన జవాన్ శబరిమలలో ఇలా సంప్రదాయ,ఆధ్యాత్మిక విలువలను చాటుతూ సేవలు అందించడం గర్వకారణమని భక్తులు,స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.భద్రతా విధులతో పాటు భక్తి భావాన్ని ప్రతిబింబించిన ఈ ఘటన శబరిమల యాత్రలో ప్రత్యేక ముద్ర వేసింది.